24 గంటల్లో 1500 మంది మృతి
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. కరోనా మరణాల విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి చేరుకుంది అమెరికా. గురువారం, శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు సంభవించాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. దాదాపు 1,500 మంది కరోనా బాధితుల మృత్యువాత పడ్డారని వెల్లడించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, అమెరికాలో ఈ సంఖ్య 2 లక్షల 77 వేలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 60 వేల మంది అమెరికాలో 7,400 మంది మరణించారు.













