వలస విధానాలకు స్వస్తి : ప్రమీలా జయపాల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. ట్రంప్ ఆవలంబిస్తున్న ఈ విధానాల వల్ల దేశంలోకి వచ్చే వలస కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆందోళనకారులు తెలిపారు. ప్రధానంగా వలస కుటుంబాలను వేరు చేస్తూ తల్లిదండ్రులను ఒకచోట, వారి పిల్లలను మరోచోట నిర్బంధించడం దారుణమని చెప్పారు. ఇలా చేయడం వల్ల 2000 మంది చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన ఆందోళనలో ప్రవాస భారతీయులతోపాటు డెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. వాషింగ్టన్లో జరిగిన ర్యాలీలో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ నాయకురాలు ప్రమీణ జయపాల్ మాట్లాడుతూ వలస విధానాలకు అధ్యక్షుడు ట్రంప్ స్వస్తి పలుకాలని సూచించారు. ఆందోళనపై ట్రంప్ స్పందిస్తూ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఉపేక్షించం అని ట్వీట్ చేశారు.













