అమెరికా పర్యటనలో అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించనున్నట్లు ఏఐసీసీ తీర్మానం చేసిన నేపథ్యంలో శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడికే పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది కీలక నాయకులున్నారన్న జైట్లీ కీలక బాధ్యతలు అప్పగించే ముందు ఆయా నేతల శక్తి, సామర్థ్యాలను అంచనా వేస్తే బాగుంటుందని హితవు పలికారు. అమెరికా పర్యటనలో ఉన్న అరుణ్ జైట్లీ రాహుల్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నరని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి. ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడిన నేపథ్యంలో జైట్లీ కూడా అక్కన్నుంచే రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారు.













