టాటా సభలకు కాంగ్రెస్ నేతలు
తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ యూఎస్ఏలో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మధుయాష్కీ గౌడ్లు హాజరు కానున్నారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్, యూఎస్ఏ తెలంగాణ ఛాపర్ట్ ఈ నెల 28న యూఎస్ఏలో నిర్వహిస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టాటా కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లారు. మిగతా నాయకులు కూడా వెళ్లనున్నారు. జూన్ 2న డల్లాస్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకల్లోనూ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.













