TANA: తానా కొత్త కార్యవర్గం (2025- 27)కు అభినందనలు…
(చెన్నూరి వెంకట సుబ్బారావు)
తానా (TANA) లో ఒక అధ్యాయం ముగిసింది. ఒక రాజ్యాంగ సంక్షోభం ఎలాంటి సరికొత్త ఇబ్బందులు లేకుండా ముగిసింది. వచ్చేవారం, జూలై 3-5 తేదీలలో జరిగే 24 వ తానా మహా సభల చివరి రోజు పదవీ స్వీకారం చేయాల్సిన కార్యనిర్వాహక వర్గం ఎన్నిక పూర్తి అయింది. ప్రస్తుత తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కోడాలి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. నరేన్ కోడాలి, ప్రస్తుత బోర్డు సభ్యులను, ఎన్నికల ప్రణాళికను నిర్వహించిన కమిటీ సభ్యుల చొరవ ప్రశంసనీయం. 2025- 27 కాలానికి ఎన్నికైన కార్యవర్గ సభ్యులను, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ శ్రీనివాస్ లావుకు, తానా బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా ఎన్నికైన డైరెక్టర్స్, తానా ఫౌండేషన్ ట్రస్టీలుగా ఎన్నికైన ట్రస్టీలకు శుభాభినందనలు.
ఫౌండేషన్ ట్రస్టీలుగా శ్రీకాంత్ దొడ్డపనేని, కిరణ్ దుగ్గిరాల, త్రిలోక్ కంతేటి, సతీష్ కొమ్మన, దేవేంద్ర రావు లావు, ఠాగూర్ మల్లినేని, సతీష్ మేకా, శ్రీనివాస్ ఓరుగంటి, మధుకర బి. యార్లగడ్డ, ఫౌండేషన్ డోనర్ ట్రస్టీలుగా శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, ప్రసాద నల్లూరి ఎన్నికయ్యారు.
బోర్డ్ డైరెక్టర్లు (2025-2029) పదవులకు నాన్-డోనర్ డైరెక్టర్ కేటగిరి నుంచి వెంకట్ కోగంటి, భరత్ మద్దినేని, జనార్ధన్ నిమ్మలపూడి, అనిల్ చౌదరి ఉప్పలపాటి, డోనర్ డైరెక్టర్ నుంచి నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఎన్నికయ్యారు.
తానా ప్రాంతీయ ప్రతినిధులుగా
న్యూ ఇంగ్లాండ్ – మౌనిక మణికొండ,
న్యూయార్క్ – శ్రీనివాస్ భర్తవరపు,
న్యూజెర్సీ – సుధీర్ చంద్ నారెపాలెపు,
మిడ్ అట్లాంటిక్ – ఫణి కుమార్ కంతేటి,
క్యాపిటల్ ఏరియా – సుధీర్ నాయుడు కొమ్మి,
అప్పలాచియన్ – రవి చంద్ర వడ్లమూడి,
సౌత్ ఈస్ట్ – శేఖర్ కొల్లు,
నార్త్ – రాంప్రసాద్ చిలుకూరి,
ఒహియో వ్యాలీ – ప్రదీప్ కుమార్ చందనం,
సౌత్ సెంట్రల్ – రవి కుమార్ పోట్ల,
డిఎఫ్డబ్ల్యు – సతీష్ బాబు కోటపాటి,
సౌత్ వెస్ట్ – మనోజ్ కుమార్ పాలడుగు,
నార్త్ సెంట్రల్ – రామకృష్ణ వంకిన,
సదరన్ కాలిఫోర్నియా – హేమకుమార్ గొట్టి,
నార్తర్న్ కాలిఫోర్నియా – సుధీర్ ఉన్నం,
నార్త్ వెస్ట్ – సుంకరి శ్రీరామ్ ఎన్నికయ్యారు.







