NATS: నాట్స్ సంబరాల విజయవంతానికి కమిటీల కృషి : కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాలు (America Telugu Sambaralu) ఈసారి టంపా వేదికగా జూలై 4, 5, 6 తేదీల్లో జరగనున్నాయి. టంపాలో జరిగే ఈ సంబరాలకు ఆగ్ర సినీతారలు తరలివస్తున్నారని అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్ సందడి చేయనున్నారని వివరించారు. వీరితోపాటు పలువురు హీరోయిన్ లు కూడా వస్తున్నారని ఆయన చెప్పారు. హీరోయిన్‌లు శ్రీలీల, ఫరియా అబ్దుల్లా, నాటి హీరోయిన్‌లు మీనా, ఆమని, జయసుధ తదితరులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సినీ దర్శకులు కే. రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, మెహర్ రమేష్ తదితరులు కూడా ఈ సంబరాలకు వస్తున్నారని ఇంతమంది భారీ తారాగణం తెలుగు మహాసభలకు రావడం ఇదే మొదటిసారని అంటూ, కమిటీ సభ్యులంతా తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి వేడుకల విజయవంతానికి కృషి చేయాలని ఆయన కోరారు.
అమెరికా తెలుగు సంబరాల కమిటీ సమావేశంలో పలు కమిటీలను మీడియాకు ఆయన పరిచయం చేశారు. మూడు రోజుల పాటు జరిగే అమెరికా తెలుగు సంబరాలు నెవ్వర్ లిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా జరగనున్నాయని గుత్తికొండ తెలిపారు. స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుందన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఎన్నో కార్యక్రమాలు ఈ సంబరాల్లో ఉంటాయని గుత్తికొండ శ్రీనివాస్ చెప్పారు. సంబరాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నానున్నారు. ఇంతవరకు తెలుగు సంఘాల చరిత్రలో కనిపని ఎరుగని రీతిలో అమెరికా తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నామని.. అమెరికాలో ఉండే తెలుగు ప్రజలంతా ఈ సంబరాలకు విచ్చేయాలని శ్రీనివాస్ గుత్తికొండ కోరాదు. ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం. కలిసి అందరం అంటూ పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, మాజీ అధ్యక్షులు మదన్ పాములపాటి తదితరులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంబరాలు ఈసారి దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నాట్స్ నాయకులు టంపాలో విఘ్నేశర్వ సహస్ర మోదక హోమం నిర్వహించారు. ఈ సంబరాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వర హోమాన్ని నాట్స్ నిర్వహించింది. నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది.







