కలెక్టర్ కు ప్రవాసాంధ్రుల ఘనస్వాగతం
అమెరికా పర్యటనకు వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) సభ్యులు కలెక్టర్ లక్ష్మీకాంతంను డల్లాస్ విమానాశ్రయంలో ఘనంగా సత్కరించారు. కృష్ణాజిల్లాలో 440 డిజిటల్ క్లాస్ రూములను ప్రవాసాంధ్రుల సహకారంతో అభివృద్ధిపరచడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల భవనాలు, పంచాయతీ భవనాలు, నిర్మాణాల్లో ఎన్ఆర్ఐ సహకారంతో నిర్మించడం, అదేవిధంగా గర్బిణీ, బాలింతలు, బరువుతక్కువ ఉన్న పిల్లల కోసం పౌష్టికహార పథకం అమలులో ఎన్ఆర్ఐల సహకారంతో కలెక్టర్ చేస్తున్న కృషిని ప్రవాసాంధ్రులు ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో పలు కీలక పదువుల్లో ఉన్న జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు కృష్ణా జిల్లాలో సంక్షేమ, సేవా కార్యక్రమాలకు చొరవగా ముందుకు రావడం అభినందనీయం అని వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.













