సిఎంఇ సదస్సులో ఆరోగ్య సూచనలిచ్చిన డాక్టర్లు
వాషింగ్టన్డీసీలో జరుగుతున్న తానా 22వమహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సిఎంఇ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమానికి అమెరికా వ్యాప్తంగా ఉన్న వైద్యులతో పాటు భారతదేశానికి చెందిన పలు విభాగాల్లో వైద్యులుగా పనిచేస్తున్న ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు తమ అనుభవాలను నూతనంగా వస్తున్న రోగాలు, వ్యాధులు, వాటి చికిత్సా విధానాలు, నూతన సాంకేతికత, వైద్యుల మధ్య అవగాహన, సమన్వయం వంటి విషయాలను ఇందులో చర్చించారు.
తానా సభలకు ఆతిథ్యం ఇస్తున్న జిడబ్ల్యుటీసిఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ మన్నె ఈ సమావేశానికి సమనయ్వకర్తగా వ్యవహరించగా, ప్రముఖ పిల్లల మానసిక వైద్య నిపుణులు డా. నవీన హేమంత్, డా. శ్రీనగేష్ పాల్వాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. డాక్టర్ యడ్ల హేమప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. సూర్యనారాయణ సీరం, డా. వాణీరావు, డా. ఉజ్వల దీక్షిత్, డా. వేణుబత్తిని, డా. కల్పన, డా. జీ. రవీంద్రనాథ్ తదితర డాక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.













