ఆటా సిఎంఇ కార్యక్రమాలు
ఆటా మహాసభల్లో సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ, బిజినెస్ గోష్టులతోపాటు సిఎంఇ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. జూన్ 9వ తేదీన ఉదయం 9 నుంచి 12.30 వరకు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎంఇ) కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రధాన వక్తగా ప్రైమ్ హెల్త్ కేర్ ఫౌండర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇందులో పలువురు డాక్టర్లు కూడా వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. లాంగ్ కోవిడ్, దాని పరిణామాలు అంశంపై మాధవి సిద్ధాంతి మాట్లాడనున్నారు. ఆసియావాసుల్లో గుండె జబ్బులు, కారణాలు అంశంపై నీలిమ కటుకూరి మాట్లాడుతారు. మహిళల కార్డియోవాస్క్యులర్ హెల్త్ అంశంపై లలిత మేడిపల్లి, ఒబెసిటీ మెడిసిన్‌లో వచ్చిన అడ్వాన్స్ ప్రక్రియలు గురించి నందిని సుంకిరెడ్డి, మెనోపాజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అంశంపై అఖిల కొత్తపల్లి, ప్రైమరీకేర్, ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎఐ ద్వారా చేసే చికిత్స వల్ల వచ్చే పరిణామాలపై బెల్లంకొండ కిషోర్, స్యూసైడల్ బిహేవియర్, మనం ఏమి చేయాలి, ఎలా అరికట్టాలి అన్న అంశంపై రవి సింగారెడ్డి మాట్లాడనున్నారు.
సిఎంఇ కమిటీ చైర్‌గా డాక్టర్ శ్యామల డి ఎర్రమిల్లి, కో చైర్‌గా డాక్టర్ సుధారెడ్డి, డాక్టర్ నందిని సుంకిరెడ్డి, అడ్వయిజర్‌గా డాక్టర్ సుజిత్ పున్నం ఉన్నారు.







