అమెరికా అధ్యక్షుడుకి కేసీఆర్ కానుకలు ఇవే…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత రాష్ట్రపతి రామ్నాత్ కోవింద్ ఇచ్చిన విందులో ప్రత్యేకత సంతరించుకున్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటోను కేసీఆర్ ఆందజేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను.. మెలానియా, ఇవాంకకు బహుకరించేందుకు ప్రత్యేకంగా తయారీ చేసిన చేనేత చీరలను అందజేశారు. గతంలో కూడా హైదరాబాద్ పర్యటనకు సందర్భంగా ఇవాంకకు కేసీఆర్ ప్రత్యేక బహుమతి అందజేసిన విషయం తెలిసిందే.













