కష్టాల్లో ఉన్న ఎన్నారైలను ఆదుకుంటాం – కేసీఆర్
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణకు చెందిన ఎన్.ఆర్.ఐ.కి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందిస్తుందని, దీని కోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐఎఎస్ అధికారి నేత త్వంలో పనిచేసే ఈ సెల్ కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్.ఆర్.ఐ. కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎన్.ఆర్.ఐ. సెల్, కమిటీ ఏర్పాటు, అవి పనిచేసే విధానంపై కార్యాచరణ రూపొందించాల్సిందిగా మంత్రి శ్రీ కెటి రామారావు, ఎంపి శ్రీమతి కవితలను సీఎం ఆదేశించారు. తెలంగాణ ఎన్.ఆర్.ఐ.ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం ఈ సెల్, కమిటీ పనిచేయాలని సీఎం కోరారు. ఎన్.ఆర్.ఐ.ల సంక్షేమం కోసం బడ్జెట్లో వంద కోట్ల కేటాయించామని, అందులోంచి 50 కోట్ల రూపాయలను సెల్ కు బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజల ఎజెండా రూపొందించడంలో తెలంగాణ నాయకత్వం చేస్తున్న క షిని వివరించాలని చెప్పారు. తెలంగాణ బిడ్డలుగా నాడు ఉద్యమ సందఠంలో ఎలాంటి సహకారం అందించారో, నేడు భారతదేశ బిడ్డలుగా దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.













