కాలిఫోర్నియా గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ
కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీబ్రౌన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య రాజకీయాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన క్రియాశీలకపాత్ర, కాంగ్రెసేతర ఉద్యమాల గురించి చంద్రబాబు వివరించారు. ప్రకృతి పరి రక్షణ కార్యక్రమాన్ని పౌరుల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మలిచామని తెలిపారు. పెద్ద ఎత్తున జలసంరక్షణ, వన సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి, ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో తమకు తోడ్పాటునందించాలని కోరారు. కొత్త రాజధాని అమరావతిని నిర్మాణ దశలోనే సందర్శించి తగు సూచనలు, సలహాలు అందించాలని గవర్నర్ బ్రౌను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ భేటీలో ముఖ్యంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు ఉన్నారు.













