NATS: నాట్స్ తెలుగు సంబరాలు – సినిమా హాల్స్
నేటి యువత కు, ఎప్పుడో ఈ దేశానికి వచ్చిన పెద్దలకు కూడా నచ్చే ఏకైక అంశం – సినిమా అన్న విషయం అందరికీ తెలిసిందే. నాట్స్ (NATS) లీడర్ షిప్ కూడా ఇప్పుడు టాంపా (Tampa) నగరం లో జరుగుతున్న 8 వ తెలుగు సంబరాలలో సినిమా సంబంధ వినోదానికి పెద్ద పీట వేశారని కూడా అందరికీ తెలిసిన విషయమే..
ఈ తెలుగు సంబరాలలో మొదటి సారిగా రెండు థియేటర్ లలో రెండు రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతాయని 6 వారాల క్రితమే తెలుగు సంబరాలు కన్వీనర్ శ్రీ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు కదా..
ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న కార్య క్రమాలకు పెద్ద ఆడిటోరియం కి “రంగ స్థలం” అని పేరు పెట్టారు. పైన ఒక డిజిటల్ బోర్డ్ లో అలనాటి తెలుగు సినిమా పోస్టర్స్ కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే రెండవ ఆడిటోరియం కి “నర్తన శాల” అని పేరు పెట్టారు. ఇవి రెండూ తెలుగు సినిమాల మీద తెలుగు వారి మక్కువ ను తెలుపుతూ తెలుగు సంబరాల కు వన్నె తెస్తున్నాయి అని చెప్పొచ్చు
.







