AAA: ఎఎఎ మహాసభలకు సినిమా తారల రాక
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఎఎఎ) మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా (Phildelphia) ఎక్స్ పో సెంటర్లో మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహాసభలకు సినిమా కళాకారులు తరలివస్తున్నారు.
సినీ నటులు శ్రీకాంత్, ఆది, నిఖిల్, సందీప్ కిషన్, తరుణ్, సుశాంత్, విరాజ్ అశ్విన్ తదితరులు వస్తున్నారు.
హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మెహ్రీన్, అంకితకుమార్, రుహానీ శర్మ, అమృత అయ్యర్, దక్షనగార్కర్, కాయల్ ఆనంది, రీతు చౌదరి నువేక్ష, చంద్రిక రవి తదితరులు వస్తున్నారు.
దర్శకులు శ్రీను వైట్ల, సందీప్ రెడ్డి వంగా, వెంకీ అట్లూరి, వీరభద్రమ్ తదితరులు వస్తున్నారు.
మహాసభలకు హోస్ట్‌గా మిర్చి భార్గవి వ్యవహరిస్తున్నారు.







