పరిశోధనలను హ్యాక్ చేసేందుకు చైనా యత్నం : అమెరికా
వ్యాక్సిన్ అభివృద్ధికి జరుగుతున్న పరిశోధనలను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), సైబర్ సెక్యూరిటీ నిపుణులు భావిస్తున్నారని అక్కడి రెండు ప్రధాన వార్తాపత్రికలు వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ వెల్లడించాయి. ఈ హ్యాకర్లకు చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్నట్లు వారు విశ్వసిస్తున్నారని తెలిపాయి. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చైనా లక్ష్యంగా వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొంది.






