ఐదుగురు చైనా పౌరులపై అమెరికాలో కేసు
అమెరికాలోని, పలు ఇతర దేశాల్లోని 100కి పైగా కంపెనీలు, సంస్థల వెబ్‌సైట్స్ ను హ్యాక్ చేసి, సున్నితమైన, విలువైన సమాచారం తస్కరించారని ఆరోపిస్తూ ఐదుగురు చైనా పౌరులపై అమెరికా కేసు నమోదు చేసింది. వారు హ్యాక్ చేసిన వాటిలో భారత ప్రభుత్వ విభాగాలకు చెందిన పలు వెబ్సైట్లు ఉన్నాయి. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆ చైనా పౌరులకు ఇద్దరు మలేషియన్లు సహకరించారని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోజెన్ వెల్లడించారు. భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ వీపీఎన్ నెట్ వర్క్‌తో అనుసంధానమయ్యేందుకు వారు వీపీఎస్ ప్రొవైడర్ సర్వర్లను ఉపయోగించుకున్నారు. భారత ప్రభుత్వ కంప్యూటర్లలో కోబాల్ట్ స్ట్రెక్ మాలేవేర్ను ఇన్స్టాల్ చేశారు అని డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ వివరించారు.













