Manabadi: పియోరియా సిలికాన్ ఆంధ్ర మనబడి కేద్రం లో పిల్లల పండగ!
ప్రతి సంవత్సరం అమెరికా లోని మనబడి (Manabadi) కేంద్రాల్లో పిల్లలపండుగ (వార్షికోత్సవం జరుపుకోవటం) ఆనవాయితి ! గత ఆదివారం అరిజోన రాష్ట్రం లోని పియోరియా (Peoria) మనబడి కేంద్రం లో పిల్లల పండుగను ఘనం గా నిర్వహించారు ! తెలుగు భాషా,సంస్కృతి పట్ల ఉన్న మక్కువను ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా కొనసాగింది.
అరిజోన ప్రాంతీయ సమన్వయ కర్త వల్లభాపురపు బాలాజీ , మనబడి కేంద్ర ఉపాధ్యాయులు మరియు, భాషా సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో మనబడి పిల్లలు మరియు తల్లి తండ్రులు ఎంతో ఉత్సాహంగ పాల్గొన్నారు
వివిధ తరగతులకు చెందిన మనబడి చిన్నారులు ఎంతో ఉత్సాహం గా పాల్గొని . తెలుగు భాష, సంస్కృతికి చెందిన ఎన్నో విషయాలు పద్య, గద్య కావ్య, నృత్య,నాటిక రూపాలలో ప్రదర్శించారు.పిల్లల నాటికలు మరియు బాలబడి చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు భాష పై మన పిల్లలకు వున్న ప్రేమ,తెలుగు భాష పై వారికున్న పట్టు అందరిని ఆకట్టుకుంది. గత రెండు మసాములుగా మనబడి గురువులు పిల్లలచేత సాధన చేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పియోరియా మనబడి కీలక బృందం శ్రీనివాస్ గారు పద్మజ గారు, లతా గారు, దీపక్ గారు, శిరీష గారు, దివ్య గారు, వాసంతి గారు,వంశీ కృష్ణ గారు, మల్లికార్జున్ గారు, కేశవ్ గారు పూర్ణిమ గారు , రవి గారు పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో శోభాయమానంగా నిర్వహించారు. అలాగే మనబడిలో పట్టభద్రులైన బాలగురువులు స్వాగత్,శిశిర్,అదితి,షామిత,యశిత లు పిల్లల పండుగ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. తల్లి తండ్రులు అందరు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకోవడం చాలా అభినందనీయం.
బాలాజీ గారు మాట్లాడుతు గత పదకొండు సంవత్సరములుగా పియోరియా కేంద్ర నిర్వహణ విశేషాలు పంచుకొన్నారు. మనబడి యొక్క లక్ష్యం, తెలుగు భాష మరియు మన సంస్కృతిని రాబోయే తరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు, అలాగే మనబడి ప్రతి ఇంట ఉండేలా చేయవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని గుర్తుచేశారు. మనబడికి తమ పిల్లలను పంపిస్తున్నందుకు తల్లి తండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. వచ్చే విద్య సంవత్సరానికి నమోదు వివరాలు చక్కగా వివరించి, కొత్త విద్యార్థుల నోమోదుకు, మనబడి ప్రాచుర్యానికి పూర్తిగా సహకరించాల్సిందిగా అందరిని కోరారు.
సుమారు ౩౦౦ మందికి పైగా హాజరైన ఈకార్యక్రమంలో భారతదేశం నుండి విచ్చేసిన మన ముందుతరం ఎంతో ఉత్సాహంగ పాల్గొన్నారు
మనబడి సేవలను, తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్లే బాథ్యతను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నందుకు మనబడి పియోరియా బృందానికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు తెలియచేసారు.
అందరూ అమెరికా, భారత జాతీయ గీతాలు ఆలపించి చక్కటి విందు భోజనంతో ఈకార్యక్రమాన్ని దిగ్విజయంగ ముగించారు.








