2 వేల మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరం : అమెరికా
అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద దాదాపు 2 వేల మంది పిల్లలను అమెరికా వారి తల్లి దండ్రుల నుండి, సంరక్షకుల నుండి వేరు చేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న జీరో టోలరెన్స్ వలస విధానం అమలులోకి వచ్చిన తరువాత దాదాపు రెండు వేల మంది పిల్లలను వేరు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 19-మే 31 మధ్య ఎటు వంటి పత్రాలు లేకుండా అమెరికా సరిహద్దు దాటుకు వచ్చారన్న కారణంగా 1,995 మంది మైనర్లను, 1,940 మంది తల్లిదండ్రుల నుండి వేరు చేసినట్లు అమెరికా హోంలాండ్ సెక్యూర్టీ విభాగ ప్రతినిధి తెలిపారు.













