విటమిన్-డి లోపంతో పిల్లల్లో బీపీ
విటమిన్-డి లోపంతో పుట్టిన ప్లిలలకు చిన్న వయసులోనే సిస్టోలిక్ బీపీ (ఊర్థ్వ రక్తపోటు) వచ్చే ప్రమాదం ఎక్కువని అమెరికాలోని హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇతరులతో పోలిస్తే డి-విటమిన్ లోపం ఉన్న చిన్నారులు 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు మధ్య అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే ప్రమాదం 60 శాతం ఎక్కువని వారు వెల్లడించారు. హై బీపీ వలన గుండె సంబంధిత సమస్యలు అధికమవుతాయని చెప్పారు. సూర్యరశ్మిలో అధికంగా లభించే విటమిన్-డి ఎముకల పటుత్వానికి ఎంతో అవసరం. అధ్యయనంలో భాగంగా అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 18 ఏళ్ల వరకు వయసున్న 775 మందిపై వారు పరిశోధన చేశారు.













