చికాగో మారథాన్ రద్దు
అక్టోబర్ 11న జరగాల్సిన 43వ చికాగో మారథాన్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 45 వేల అథ్లెట్లతో అట్టహాసంగా జరగాల్సిన ఈ మారథాన్ రేస్ చరిత్రలో రెండోసారి మాత్రమే రద్దైంది. ప్రపంచవ్యాప్తంగా టోక్కో, బోస్టన్, లండన్, బెర్లిన్, న్యూయార్క్‌లలో జరిగే మారథాన్ రేస్‌లలో చికాగో మారథాన్ రేస్ అత్యంత ప్రాథాన్యతను సంతరించుకుంది. 45వేల రన్నర్లు, వేలసంఖ్యలో వాలంటీర్లు, అభిమానులు ఈసారి ఇళ్లకే పరిమితం కావాల్సి ఉందని చికాగో మేయర్ లోరీ లైట్పూట్ తెలుపగా.. అథ్లెట్లు, వాలంటీర్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేస్ డైరెక్టర్ కారీ పింకోవ్క్సీ ఓ ప్రకటనలో తెలిపారు. 1987లో తొలిసారి స్పాన్సర్ల సమస్య కారణంగా చికాగో మారథాన్ రద్దు చేయబడింది.













