కన్నుల విందుగా చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) వనభోజనాల కార్యక్రమం
చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం జులై 11వ తేదీన కన్నులవిందుగా నిర్వహించారు. చికాగో నగరంలో కరోనా నిబంధనలు సవరించిన పిమ్మట జరిగిన మొట్టమొదటి అతిపెద్ద తెలుగు సామూహిక కార్యక్రమం ఇదే. పసందైన ఆంధ్ర వంటకాలతో, ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేపర్విల్ల్ లోని మాల్ ఆఫ్ ఇండియా ఆవరణలో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపు 400 మంది హాజరయ్యారు. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో స్థాపించిన ఈ సంస్థ కరోనా సంక్షోభ సమయంలో కూడా వినూత్నమైన వినోద కార్యక్రమాలతో, ఎన్నో సేవాకార్యక్రమాతో సభ్యులకి చేరువలో ఉండటమే ఈ వనభోజన కార్యక్రమ ఆదరణకు కారణం. తెలుగువారి కోలాహలంతో ఏటా జరిగే వనభోజన పరంపరని పునరావృత్తం చేస్తున్నట్టు ప్రెసిడెంట్ శ్రీ శైలేష్ మద్ది పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. జాతర శైలిలో పిల్లలకు ఆటలు, పెద్దలకు అంగళ్ళు, మరియు పీచు మిఠాయి ఏర్పాటు చేశారు. చికాగోలో తమ పిల్లలతో గడపాలని తెలుగునేల నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు.
చికాగో ఆంధ్ర సంఘం వారు ప్రతీ సంవత్సరం సమాజ అభివృద్ధికి విశిష్ఠ కృషి చేసి సేవలందించిన ఒకరిని “లైఫ్ టైం అచీవ్మెంట్” అవార్డుతో సత్కరిస్తారు. ఈ సంవత్సరం గణిత శాస్త్ర విజ్ఞానాన్ని భావితరాలకి అందించడంలో నిరంతర కృషి సల్పిన “డా. కృష్ణయ్య రేవులూరి” గారికి ఈ పురస్కారాన్ని సగౌరవంగా అనేక సంఘ ప్రముఖుల సమక్షంలో అందరి హర్షధ్వానాల మధ్య సమర్పించి సత్కరించారు. ఈ పురస్కార కార్యక్రమానికి సీఏఏ ఛైర్మన్ సుందర్ దిట్టకవి గారు వ్యాఖ్యానిస్తూ కృష్ణయ్య గారి సేవల గురించి అందరికీ తెలియజేశారు. కృష్ణయ్య గారి ఆత్మీయులు, సన్నిహితులూ, శిష్యులూ, పిల్లలూ అందరూ ఆయనతో తమకున్న అనుభవాలని పంచుకున్నారు. కృష్ణయ్య గారు “మీరు సంపదను పంచితే, అది విభజించబడుతుంది. కానీ మీరు జ్ఞానాన్ని పంచితే, అది బహుళమవుతుంది” అనే తన జీవిత నినాదాన్ని గుర్తు చేస్తూ, ఈ సభలో కూడా తన జ్ఞానాన్ని అందరికీ పంచారు. శ్రావణి తెల్లాప్రగడ, కావ్య తెల్లాప్రగడ ప్రార్ధనా గీతాన్ని ఆలపించగా, ప్రజ్ఞ గుప్త మరియు హ్రిషికేష్ గుప్త తమ వయొలిన్ ప్రతిభ ప్రదర్శించారు.
సవిత మునగా, జయశ్రీ సోమిశెట్టి, రాధిక గరిమెళ్ళ, రాజ్ మునగా, కిరణ్ మట్టే, శ్రీనివాస్ పద్యాల గార్లు అలంకరణ మొత్తం మన ఊళ్ళలోని “జాతర”ని గుర్తుకు తెచ్చేలా తయారు చేశారు. హరిణి మేడా, రామకృష్ణ తాడేపల్లి, అనురాధ గంపాల, పుష్ప మన్నేపల్లి, కళ్యాణి అతులూరి వచ్చిన అతిధుల్ని ఆహ్వానించి నమోదు చేశారు. విజయ్ కొరపాటి, శ్రీనివాస్ పెదమల్లు, విజయ్ మన్నేపల్లి, సురేష్ ఐనపూడి, గోపాల్, శ్రీసుధ, శ్రీకృష్ణ మతుకుమల్లి, రమేష్ నెక్కంటి, రవీంద్ర్ చిట్టూరి, ప్రసాద్ చిట్టూరి, కళ్యాణ్ చిట్టూరి, కిరణ్ అతులూరి, సతీష్ మచ్చా, చందూ గంపాల తదితరుల పర్యవేక్షణలో విష్ణు విలాస్ వారు అందించిన విందుభోజనానికి తయారుచేసిన గోంగూర రైస్, మామిడికాయ పప్పు, నాటుకోడి కూర, ఆవకాయ పచ్చడి, జిలేబీతో కలిపి విందు భోజనం వడ్డించారు. సాయంత్రం మల్లీశ్వరి పెదమల్లు, లక్ష్మీ కునిగల్, ఉమ కొత్తమాసు, సునీత రాచపల్లి, ఆధ్వర్యంలో మహిళలు మరమరాల ముంత మషాలా తయారుచేసి వడ్డించారు.
ఈ సందర్బంగా పిల్లలకి సుందరవల్లి మల్లాది, పావని కొత్తపల్లి నిర్వహించిన “ఇంప్రాంప్టు క్విజ్” పోటీలో పిల్లలు చెప్పిన సమాధానాలు అందరినీ అలరించాయి. శ్యామసుందర్ పప్పు, గోపాలకృష్ణ గరిమెళ్ళ, పద్మాకర్ దామరాజు, రమణమూర్తి యడవల్లి, పద్మారావు అప్పలనేని, ప్రకాశం తాతా గార్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు బహుమతులు అందజేశారు. శ్వేతా కొత్తపల్లి, పూజిత నెట్టెం పిల్లలకి పెద్దలకి “హౌసీ” నిర్వహించి బహుమతులందించారు.
సీఏఏ సేవా విభాగం చికాగో ఆంధ్ర ఫౌండేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ రాజ్ పొట్లూరి, వాణి దిట్టకవి, ఉష కొత్త, శ్వేతా కొత్తపల్లి, నిఖిల్ దిట్టకవి గార్లు ఏర్పాటు చేసిన దేశవాళీ మొక్కల అంగడికి విశేష ఆదరణ లభించింది. దాతలు రాజ్ మునగా, సాయి యెండమూరి, తేజు దిట్టకవి, పవన్ అమిన్, గిరి కొత్తమాసు ముందుకు వచ్చి 600$ విరాళాన్ని సీఏఎఫ్ కు అందించారు.
ప్రెసిడెంట్ శ్రీ శైలేష్ మద్ది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మాలతి దామరాజు (ప్రెసిడెంట్-ఎలెక్ట్ 2022) సీఏఏ ధర్మకర్తలు దినకర్ – పవిత్ర కారుమూరి, మల్లీశ్వరి – శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ – వాణి దిట్టకవి, రాఘవ జాట్ల, ప్రసాద్ – భార్గవి నెట్టెం, పద్మారావు – సుజాత అప్పలనేని, ఉమా కటికి, సీఏఏ బోర్డ్ డైరెక్టర్లు రాజ్ పోట్లూరి, రామకృష్ణ తాడేపల్లి, గౌరిశంకర్ అద్దంకి, ఆశ కొండూరు, మురళి రెడ్డివారి, శ్రీహరి జాస్తి, సుందరవల్లి మల్లాది, విజయ్ కోరపాటి, విజయలక్ష్మీ సుసర్ల, హరిణి మేడా, పావని కొత్తపల్లి, పూజిత నెట్టెం, రామారావు కొత్తమాసు, రమేష్ నెక్కంటి, సమత పెద్దమారు, సవిత మునగా, శ్వెతా కొత్తపల్లి, ఉష కొత్త తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జరుపుటకు స్థలం కేటాయించి అన్ని విధాలా సహకరించిన మాల్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి, ముఖ్యంగా వినోజ్ చనుమోలు, ప్రమోద్ గార్లకి చికాగో ఆంధ్ర సంఘం ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ వనభోజనాలు జయప్రదం కావడానికి సహకరించిన దాతలు అశోక్ లక్ష్మణన్, కృష్ణ రంగరాజు, ఐ.ఎన్.జి. రూఫింగ్, సాయిరవి సూరిభోట్ల, ఆసిమ్ హమీది, సత్య నాగ మెడా, ప్రవీణ్ మేడికుండం తదితరులకు ప్రెసిడెంట్ శ్రీ శైలేష్ మద్ది మరియు CAA బోర్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశ్ మీడియా వారి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సహకారాన్ని పలువురు అభినందించారు.













