గ్రూప్‌లో ఆ మెసేజ్ వస్తే వాట్సాప్ క్రాష్!
ఆఫర్లు, ఫ్రీగిఫ్ట్‌లు, ఇతర లింకులు ఉండే సందేశాలను వాట్సాప్‌లో పార్వర్డ్ చేస్తున్నారా? ఇకపై అలాంటి పని చేయకండి. దాని వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్ పూర్తిగా క్రాష్ అయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని దిగ్గజ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ గుర్తించింది. వాట్సాప్‌నే టార్గెట్‌గా చేసుకున్న హ్యాకర్లు అలాంటి సందేశాలను పంపుతారని.. గ్రూపులోని సభ్యులెవరైనా దాన్ని పోస్టు చేస్తే చాట్ హిస్టరీ, డేటా తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరించింది. గ్రూప్‌లో ఉండే సభ్యులందరూ వాట్సాప్‌ను తొలగించి, మళ్లీ ఇన్స్టాల్ చేసుకుంటే తప్ప..యాప్ పనిచేయదని పేర్కొంది.













