ఆటా జాతీయపురస్కారం అందుకున్న చారుగుండ్ల రాజశేఖర్
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) జాతీయపురస్కారాల ప్రధానోత్సవం భధ్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శుభం ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ మండలం కూచిపూడి తండా ప్రాధమికోన్నత పాఠశాలలో యస్జిటి గా పని చేస్తున్న చారుగుండ్ల రాజశేఖర్ కు ఈ పురస్కారాన్ని సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మినారాయణ, భధ్రాధి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ యం.రామకృష్ణ, అవార్డు కమిటీ చైర్మన్ బెక్కంటి శ్రీనివాస రావులు రాజశేఖర్, సీతామహాలక్ష్మి, దంపతులను శాలువ, మెమెంటో సన్మానం పత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. రాజశేఖర్ సామాజిక సేవను వారు అభినందించారు. కాగా జాతీయ పురస్కారానికి ఎంపికైన రాజశేఖర్ ఉపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో నిర్వహించడం తో పాటు విజయీభావా ట్రస్టు ను స్థాపించి విద్యార్థులకు మనో వికాస, ప్రేరణ తరగతులు నిర్వహిస్తు అనేక అవార్డులు పొందారు. తెలంగాణ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లో సహితం ఆయన విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు.













