ఎస్పీ బాలు హిట్ సాంగ్స్ తో ‘చైత్రగానం’.. కరోనా టైంలో కళాకారులకు అండగా ఎన్నారై!
బోస్టన్: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కళాకారులకు అండగా నిలవడం అమెరికాలోని బోస్టన్ వాస్తవ్యులు పద్మినీ నాగరాజన్ బృందం ఒక ఆలోచన చేసింది. ‘చైత్ర గానం’ పేరిట వర్చువల్గా ఒక కాన్సర్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో 300 సినిమా పాటలు, 5వేల వరకూ ప్రైవేటు గీతాలు ఆలపించిన సాయిశ్రీకాంత్ పాల్గొంటారు. ఈయన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేవరెట్ సింగర్ కూడా. ఈయనతోపాటు యువ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ సన్నిహితుడు, 400 పై చిలుకు సినీగీతాలు ఆలపించిన వేణు శ్రీరంగం, అలాగే 400 పై చిలుగు సినీగీతాలు, మరెన్నో ప్రైవేటు పాటలు పాడిన ప్రణవి ఆచార్య కూడా ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు. వీళ్లందరూ కలిసి ఈ ‘చైత్రగానం’ కార్యక్రమంలో స్వర్గీయ గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం క్లాసికల్ హిట్స్ ఆలపించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24న అంటే శనివారం ప్రారంభం కానుంది. అలాగే ఆదివారం కార్యక్రమం ముగింపు ఉంటుంది.
అయితే ఈ కార్యక్రమానికి టికెట్స్ Zelle, Venmo, Pay pal ద్వారా తీసుకోవచ్చని నిర్వాహకులు తెలుపుతున్నారు.
ఒక మంచి ప్రయత్నం చేస్తున్న వీరికి అభినందనలు.













