కరోనా లక్షణాల జాబితాలో మరో ఆరు
కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరు వచ్చి చేరాయి. అమెరికాలోని సెంటర్స్ ఆఫ్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) వీటిని జోడించింది. ఇప్పటిదాకా ఉన్న జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలకు తోడుగా.. ఇప్పుడు రుచి, వాసనలకు గ్రహించలేకపోవడం, చలి పుట్టడం, చలితో వచ్చే వణుకుడు, తలనొప్పి, గొంతులో మంట, కండరాల నొప్పి వంటి ఇబ్బందులు కనిపించినా కరోనా సోకినట్లు అనుమానించాల్సిందేనని సీడీసీ చెప్పింది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక 2 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడవచ్చునని తెలిపింది. ఛాతీలో విడవకుండా నొప్పి వస్తున్నా, గందరగోళంగా అనిపిస్తున్నా, పెదవులు కానీ, ముఖం కానీ నీలి రంగులోకి మారుతున్నా జాగ్రత్త పడాలని సీడీసీ హెచ్చరించింది. జాబితాలో పేర్కొన్న లక్షణాలే కాకుండా ఇతరత్రా మరేవైనా తీవ్ర ఇబ్బందులుంటే వైద్యులను సంప్రదించాలంది.













