కాట్స్ నూతన కార్యవర్గం 2020-2021
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (కాట్స్) 2020- 2021 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షురాలిగా శ్రీమతి సుధారాణి కొండపు, ఉపాధ్యక్షలుగా సతీష్ వడ్డీ, కార్యదర్శిగా దుర్గాప్రసాద్ గంగిశెట్టి, కోశాధికారిగా పార్ధసారధి బైరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా హరీష్ కుమార్ కొండమడుగు, కమ్యూనిటీ సర్వీస్ కార్యదర్శిగా రామచంద్రరావు ఆరుబండి, ధర్మకర్తలుగా ప్రవీణ్ కాటంగురి, గోపాల్ నున్న, వెంకట్ కొండపోలు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో కాట్స్ మాజీ అధ్యక్షులు రవి బొజ్జ గారు నూతన అధ్యక్షురాలు సుధారాణి గారికి పదవీ బాధ్యతలను అప్పగించగా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వూట్ల నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. అడ్వైజర్స్ శ్రీ భువనేష్ బూజాల, మధుకోల, భాస్కర్ బొమ్మారెడ్డి, అనిల్ నీరుకొండ తో పాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.













