కార్డి బి తో బెర్నీ శాండర్స్ భేటీ
వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న సోషలిస్టు బెర్నీ శాండర్స్, ప్రముఖ ఆర్టిస్ట్ కార్డి బితో భేటీ అయ్యారు. ఇరువురూ వ్యక్తిగతంగా భేటీ కావటం ఇదే తొలిసారి. ఇరువురు నేతలూ ప్రస్తుతం దేశాన్ని వేధిస్తున్న విద్యార్థి రుణభారం, వాతావరణ కాలుష్యం, కనీస వేతనాలు వంటి సమస్యలపై చర్చించారు. వీరిరువురూ డెట్రాయిట్లో జరిగిన డెమొక్రాటిక్ అభ్యర్థిత్వ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్డి బి మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి యువతను ఎక్కువగా ఆకర్షించే లక్ష్యంతో తాము కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా భవిత యువతపైనే ఆధారపడి వుందని ఆయన అన్నారు. తనతో భేటీ అయిన బెర్నీ శాండర్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.













