డీసీ కిచెన్లో సీఏటీఎస్ సేవాకార్యక్రమం విజయవంతం
డీసీ సెంట్రల్ కిచెన్లో కాపిటోల్ ఏరియా తెలుగు సొసైటీ (సీఏటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాకార్యక్రమం విజయవంతమైంది. వాషింగ్టన్ డీసీలోని ఈ కిచెన్లో తమ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన వారందరికీ సీఏటీఎస్ ధన్యవదాలు తెలిపింది. ‘డీసీ సెంట్రల్ కిచెన్లో సేవా కార్యక్రమానికి వాలంటరీగా సాయం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాయం లేకుండా ఇదంతా సాధ్యం అవుతుందని మేం అనుకోవడం లేదు. ఇలాంటి మంచి కమ్యూనిటీలో ఉంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం’ అని తెలిపింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించిన రామ్ రెడ్డి, శ్రీనివాస యావసాని, అవనిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.













