క్యాట్స్ ఆన్లైన్ తెలుగు తరగతులు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (క్యాట్స్) తెలుగు తరగతులను ఆన్లైన్లో నేర్పించేందుకు ఏర్పాట్లు చేసింది. కరోనా ధాటికి ప్రస్తుత పరిస్థితుల్లో, మన పిల్లలకు మంచి వ్యాపకం కలిపించాలనే సదుద్దేశంతో ప్రతీ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10-12 ఆన్లైన్ లో తెలుగు నేర్పాలని క్యాట్స్ భావిస్తోంది. మీ పిల్లలకు తెలుగు మాట్లాడడం, చదడవం, రాయడం, ఇంకా వారి భవిష్యత్తును సరిదిద్దే చక్కని నీతి కథలు, పద్యాలు నేర్పడానికి సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని తెలుగువారంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతోంది. 3/22 సోమవారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
గ్రూపు 1
వయస్సు 6-8 ఉన్నవాళ్ళకు అ – ఱ
ఉదయం 10 -10-30 వరకు పద్యాలు, భక్తి శ్లోకాలు
ఉ. 10:30 -11 : తెలుగు రాయడం
ఉ. 11-11:30: నీతి కథలు
ఉ.11:30-12: తెలుగు మాట్లాడడం
గ్రూపు2
వయస్సు 9 – 12 వరకు ఉన్నవారకి గుణింతాలు
ఉ. 10 – 10.30వరకు : తెలుగు రాయడం
ఉ.10:30 – 11 వరకు : పద్యాలు
ఉ.11 – 11.30 వరకు: తెలుగు మాట్లాడడం
ఉ.11:30 – 12 వరకు: నీతి కథలు
తరగతుల్లో చేరాలనుకునేవారు తమ పేర్లను కింది లింక్ ద్వారా రిజిష్టర్ చేసుకోండి. ఇ-మెయిల్ చేయండి
https://forms.gle/QD2La9AAXeMdEnVe6













