తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కె రన్
తానా ఫౌండేషన్, రూట్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు 5కె రన్ నిర్వహిస్తున్నట్లు తానా చైర్మన్ నిరంజన్ శృంగవరపు తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 35 ఏళ్లుగా మిలియన్ డాలర్ల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తానా చైర్మన్ నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మిలియన్ డాలర్ల సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో 40 నగరాలలో మన ఊరి కోసం పేరిట 5కె రన్ నిర్వహించామని తద్వారా వచ్చిన మూలధనంతో తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తునసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. బసవతారకం హాస్పటల్ సహకారంతో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఏర్పడిన అమరావతిలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా ఈ ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు.













