మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

రాబోయే సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొని సాహిత్య ప్రసంగాలలో తమ ప్రజ్ఞాపాటవాలనీ, స్వీయ రచనా పఠన విభాగం లో తమ సృజనాత్మకతనీ సహ సాహితీవేత్తలూ, తెలుగు భాషాభిమానులతో పంచుకోమని కెనడా & అమెరికా సంయుక్త రాష్ట్రాల వక్తలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా ప్రతీ రోజూ ఉదయం 10:00 EST నుంచి సాయంత్రం 6:00 EST దాకా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించే లా అంతర్జాలంలో జరుగుతుంది.
ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద కలుసుకోవడం మాకు తెలిసీ చరిత్రలో ఇదే మొదటి సారి.
ఉత్తర అమెరికా వక్తల ప్రసంగ ప్రతిపాదనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ జులై 31, 2021. ప్రతిపాదనలు, ఇతర వివరాలు పంపించవలసిన చిరునామాలు:
sadassulu@gmail.com
vangurifoundation@gmail.com
ఈ మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రాధాన్యత, ప్రధాన ఆశయాలు మొదలైన పూర్తి వివరాలకి ఇందుతో జతపరిచిన సమగ్ర ప్రకటన చూడండి.