హెచ్1-బీ వీసాలపై కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం
కెనడా ప్రభుత్వం హెచ్1-బీ వీసా నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్1-బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేసుకోవచ్చు. దీనివల్ల భారత్ సహా ఇతర దేశాలకు చెందిన హెచ్-1బీ వీసా దారులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా, హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం చేసుకోవడంతో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త నిబంధన ఏడాది పాటు లేదా 10 వేల దరఖాస్తులు స్వీకరించే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. కంపెనీల్లో హై-టెక్ విభాగాల్లో ఎన్నో వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్నారు మూడేళ్లపాటు కెనడాలో పనిచేసుకునేందుకు జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని కెనడా ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు అనంతరం అనుమతి పొందిన వారు కెనడాలో ఏ ప్రాంతంలో ఏ సంస్థలో అయినా ఉద్యోగం చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. వారి కుటుంబ సభ్యులు ఉద్యోగం లేదా చదువు కోసం తాత్కాలిక వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.













