హ్యాకర్లకు 8.6 కోట్లు చెల్లించిన కాలిఫోర్నియా వర్సిటీ
ర్యాన్సమ్వేర్ దాడి నుంచి బయటపడేందుకు శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధికారులు క్రిమినల్ హ్యాకర్టలకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారులే స్వయంగా వెల్లడించారు. ఒక రకమైన హానికరమైన సాఫ్ట్వేర్ ను ఎదుటివారి కంప్యూటర్లతో జొప్పించి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడాన్నే రామ్సమ్వేర్ అంటారు. డబ్బు చెల్లించే వరకు కంప్యూటర్ సిస్టమ్‌కు ప్రాప్యతను నిరోధించడానికి ఇది రూపొందించబడింది. శాన్ఫ్రాన్సిస్కో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కంప్యూటర్లను క్రిమినల్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోపల ఉన్న సర్వర్లపై డేటాను హ్యాకర్లు తమ గుప్పిట్లోకి తీసుకొన్నారు. తమ చేతుల్లో బంధీ అయిన మీ నెట్‌వర్క్‌ను వదిలిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దాంతో చేసేదేమీ లేక క్రిమినల్ హ్యాకర్లకు 1.14 మిలియన్ డాలర్లు యూనివర్సిటీ చెల్లించింది. ఈ మొత్తం భారతీయ కరెన్సీలో రూ.8.6 కోట్లకు సమానం.













