ఆ నిందితుడు ఓ మానసిక రోగి : అమెరికా
కాలిఫోర్నియా థౌజెండ్ ఓక్స్ నగరంలోని బార్లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అమెరికా మాజీ సైనికుడుగా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కాల్పుకు పాల్పడ్డ వ్యక్తి అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 28 ఏండ్ల నావికాదళ మాజీ సైనికుడు ఇయాన్ డేవిడ్ లాంగ్ ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అతడు డిప్రెషన్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గత కొన్నేండ్లుగా డేవిడ్ లాంగ్‌ను చాలాసార్లు కలిశామని పోలీసులు చెబుతున్నారు. ఇదే ఏడాది ఏప్రిల్‌లో లాంగ్ తన ఇంట్లో గందరగోళం సృష్టించినపుడు పోలీసులు అతడిని పిలిపించి కౌన్సింగ్ కూడా నిర్వహించారు.













