పెరుగుతున్న కొరోనా కేసులతో మరల ఆంక్షలు విధించిన కాలిఫోర్నియా
కాలిఫోర్నియా లో కరోనావైరస్ కేసులు పెరగడంతో, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఇప్పటి దాకా ఏ రాష్ట్రం ప్రకటించని నిర్ణయం ప్రకటించారు. సోమవారం 13 జూలై నుండి కాలిఫోర్నియా లో రెస్టారెంట్లు, వైన్ తయారీ కేంద్రాలు, సినిమా థియేటర్లు, జంతుప్రదర్శనశాలలు , బార్లు మరియు కార్డ్ రూమ్లు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ఇండోర్ కార్యకలాపాలు అన్ని ముసి వేయబడతాయి అని తెలిపారు.
అలాగే Stay at Home అనే పాత పద్ధతి ని పాటించాలి అని ప్రకటించారు. కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతోంది కావున ఇది తప్పని సరి అని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ డేటాబేస్ ప్రకారం, కాలిఫోర్నియా లో ఆదివారం 12 జూలై నాటికి రోజుకు 8,000 కంటే ఎక్కువ కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇది ఒక నెల క్రితం కంటే రెట్టింపు.
కాలిఫోర్నియా లో మొత్తం 331,626 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది అమెరికాలో రెండవ అత్యధిక సంఖ్య మరియు కరోనా వైరస్ తో 7,000 మందికి పైగా కాలిఫోర్నియా లో మరణించారు అని తెలిపింది. రాష్ట్ర పున ప్రారంభ ప్రక్రియ కొన్నిరోజులు ఆపి మళ్ళీ కొనసాగిచే కంటే మధ్యస్థం గా ఉంచటం మేలు అని రాష్ట్ర అధికారులు పదేపదే చెప్పినట్లు మిస్టర్ న్యూసమ్ గుర్తుచేస్తూ, కాలిఫోర్నియాలోని రెండు అతిపెద్ద ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్న జిల్లాలు సోమవారం 13జూలై నుంచి ఆన్లైన్ ద్వారానే విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి అని మిస్టర్ న్యూసోమ్ ప్రకటన చేశార. పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలిఫోర్నియా కేసులలో మూడవ వంతు కేసులు లాస్ ఏంజిల్స్ కౌంటీలో ఉన్నాయి మరియు శాన్ డియాగో కౌంటీ కి చెందిన 18 కమ్యూనిటీల లో గత వారం కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందింది. ఇది రాష్ట్ర ఆమోదయోగ్యమైన పరిమితి కంటే రెట్టింపు అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ వెల్లడించారు













