కాలిఫోర్నియాలో నల్ల జాతీయుడి కాల్చివేత
కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటోలో నల్ల జాతీయుడిని అధికారులు కాల్చి చంపిన ఘటనపై వందలమంది పౌరులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదివారం రాత్రి సాక్రమెంటోలో స్టీఫొన్ అలోంజా క్లార్క్ అనే ఓ నల్ల జాతీయుడు బీభత్సం సృష్టిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇద్దరు పోలీసులు అతడు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టారు. వారిని చూసిన క్లార్క్ తన ఇంట్లోని పెరట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అతని చేతిలో తుపాకీ ఉందేమోనని పోలీసులు భావించి అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. లొంగిపోవాల్సిందిగా క్లార్క్ను కోరారు. ఈలోపే పోలీసులు అతడిపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించారు. మృతదేహం దగ్గరికి వెళ్లి చూడగా అతని చేతిలో సెల్ఫోన్ ఉంది.













