కోవిడ్ -19 పరీక్ష లపై పునరాలోచన చేస్తున్న కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్
బుధవారం, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ మాట్లాడుతూ, రాష్ట్రం కోవిడ్ -19 పరీక్షా వ్యూహాన్ని పునరాలోచన చేస్తుంది అని మరియు కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలలో ఆసుపత్రులు అధికంగా నిండిపోకుండా చూసేందుకు కృషి చేస్తోంది అని చెప్పారు.
ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ గత వారంలో రాష్ట్రం రోజుకు సగటున 8,000 కొత్త కరోనావైరస్ కేసులు వచ్చాయని, , గత రెండు వారాల్లో హాస్పిటలైజేషన్లు 44 శాతం పెరిగాయని, రాష్ట్రంలో కోవిడ్ -19 తిరిగి వచ్చిన కేసులు 7.1 శాతానికి పెరిగాయి అని తెలిపారు. ” ఈ విధం గా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయని మిస్టర్ న్యూసోమ్ హెచ్చరించారు. “రాష్ట్రం ఇప్పుడు రోజుకు సగటున 100,000 పరీక్షలు చేస్తోంది అయినా ఇంకా పరీక్షలు చేయాల్సిన డిమాండ్ పెరుగుతూనే వుంది. అందుకని మేము వ్యూహాత్మకంగా ఎవరిని పరీక్షించాలి… పాటి వ్యక్తి ని పరీక్ష చేయాల్సిన అవసరం ఉందా అని కూడా చూస్తున్నాం ” అని తెలిపారు.













