ఆటా బిజినెస్ సెమినార్
ఆటా మహాసభల్లో సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ సమావేశాలతోపాటు బిజినెస్ సెమినార్లను కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ బిజినెస్ సెమినార్లో పాల్గొని ప్రసంగించనున్నారు. జూన్ 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఈ సెమినార్ జరుగుతుంది. అమెరికా, తెలంగాణ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపుపై ఆయన ప్రసంగం ఉంటుంది. బిజినెస్ కాన్ఫరెన్స్ టీమ్‌కు చైర్‌గా కిషోర్ గూడురు వ్యవహరిస్తున్నారు. కో చైర్‌గా రవి చల్లా, రమణ గండ్ర, అడ్వయిజర్‌గా రవి పులి, జయంత్ చల్లా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా సుమ, హరీష్ బత్తిని ఉన్నారు.







