NATS: బిజినెస్ ఫోరం కార్యక్రమాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు ‘‘అమెరికా తెలుగు సంబరాలు’’ పేరుతో జూలై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో బిజినెస్ ఫోరం వాళ్ళ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇందులో బిజినెస్ రంగ ప్రముఖులు పాల్గొని వారి బిజినెస్ అనుభవాలను, మెళకువలను పంచుకోనున్నారు. బిల్డింగ్ రియల్ ఎస్టేట్ వెల్త్ విత్ కిరణ్ వేదాంతం పేరుతో ఓ కార్యక్రమాన్ని బిజినెస్ ఫోరం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇందులో రియల్ ఎస్టేట్ అడ్వయిజర్ గా పేరు పొందిన కిరణ్స్ అసోసియేట్స్ రియాల్టీ, కోష్ లోన్స్ ఫౌండర్, సిఇఓ కిరణ్ వేదాంతం పాల్గొని రియల్ రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన పెంచనున్నారు. రియల్ ఎస్టేట్ పై మీకు ఉన్న సందేహాలను ఆయన ద్వారా తీర్చుకోవచ్చునని నిర్వాహకులు చెప్పారు. ఇందుకోసం లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ను జూలై 6వ తేదీన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎఐ, ఇతర టెక్నాలజీ విషయాలపై కూడా సమావేశాన్ని బిజినెస్ ఫోరం ఏర్పాటు చేసింది. టెక్‌లో మనుగడ సాగించడానికి మాత్రమే కాకుండా దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అల్, క్వాంటం కంప్యూటింగ్, ఎల్‌ఓటి మరియు తదుపరి తరం కెరీర్‌ల భవిష్యత్తును రూపొందించే ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలన్న ఉత్సాహంతో ఈ సెషన్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు రాంప్రసాద్ గుప్తా , మరో నిపుణుడు వెంకటేష్ యెనుగుల ఈ కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించనున్నారు. ఙ







