రూ.వందల కోట్లున్నా.. అమ్మాయి దొరకట్లేదు!
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ (45) పద్దెనిమిదేళ్ల యువకుడిలా కనిపించేందుకు ఏటా రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నా. తనకు తోడు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతడికి ప్రత్యేకంగా ఓ వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ధనవంతుడి వ్యవహారం ఇప్పుడు చర్చనీయంగా మారింది. అమితమైన సంపద, అందం రెండూ ఉన్నా ఏ మగువా ఎందుకు దగ్గరకావడం లేదంటే ఈయన పెట్టిన పది షరతులే కారణం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని, భాగస్వామి దొరకడం కష్టమైన మాట నిజమేనని అంగీకరించాడు. డేటింగుకు వెళదామనుకొన్నపుడు మొదట నేను ఓ జాబితా అమ్మాయి ముందుంచుతా దాన్ని చూసి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నాకు ముడుచుకొని పడుకోవడం అలవాటు. భాగస్వామితో ఉన్నప్పుడు అలా ఉండలేం కదా. రోజుకు 111 మాత్రలు వేసుకుంటా అని జాన్సన్ తెలిపారు.













