అమెరికాలో బీఅరెస్ ఆవిర్భావ వేడుకలు, పాల్గొన్న గ్లోబల్ బీఅరెస్ ఎన్నారై కో-ఆర్డినేటర్
అమెరికా న్యూ జెర్సీ లో శ్రీనివాస్ జక్కిరెడ్డి మరియు భాస్కర్ పిన్న అద్వ్యర్యములో బీఅరెస్ 22 వసంతాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఅరెస్ పేరు మారిన తరువాత మొట్టమొదటి సభ దీనికి ముఖ్య అతిధిగా మహేష్ బిగాల పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రములో జరగట్లేదు, కొత్తగా నిర్మించిన డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం దేశానికే తలమానికంగా మారిందని అన్నారు. తెలంగాణ లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది, బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, దేశంలో బీఆర్ఎస్తో భారీ రాజకీయ మార్పులు వస్తాయన్నారు.
కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. రాష్ట్రం అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శమన్నారు వచ్చే రోజుల్లో మల్లి బీఅరెస్ ప్రభుత్వం స్థాపిస్తుందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళా అన్ని రాష్ట్రాల ఎన్నార్లను ఏకం చేస్తామని పార్టీని మరింత బలోపేతం చేస్తామని రాబోయే రోజుల్లో బీఅరెస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని అన్నారు. BRS పార్టీ 22వ వార్షికోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూఎస్ఏ లీడర్లు శ్రీనివాస్ జక్కిరెడ్డి(న్యూజెర్సీ అండ్ న్యూయార్క్) భాస్కర్ పిన్న(డెలావేర్), శ్రీశైలం గదాసు, కిరణ్ తోట, శ్రీనివాస్ మేలి, ప్రశాంత్, మహేశ్ పాల్గొన్నారు.













