యువతని సంఘటితం చేసి సమైక్యం చేసే బ్రిడ్జి బిల్డర్స్!
బ్రిడ్జి బిల్డర్స్ (Bridge Builders) యువతని సంఘటితం చేసి సమైక్యంగా ఒక తాటి మీద నడిపించే సంస్థ. ఎన్నో రాష్ట్రాల్లో విస్తరించివున్న ఈ సంస్థ టేనస్సీ రాష్ట్రం మెంఫిస్ పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా యువతకి యెనలేని చేస్తోంది. మే నెల చివరి వారం మొదలుకొని ఆగస్టు మొదటి వారం వరకు వేసవి సెలవుల్లో యువతకి సమ్మర్ క్యాంపు నిర్వహించడం వృత్తి, విద్య పరమైన అంశాల్లోనే కాకుండా వాలంటీర్ మరియు కమ్యూనిటీ యాక్టివిటీస్, సెమినార్లు నిర్వహిస్తుంది. అమెరికన్స్, ఆఫ్రికన్ అమెరికన్స్, స్పానిష్,భారతీయులు, చైనీస్, జాపనీస్, కోరియన్స్, యూరోపియాన్స్ ఇలా ఏ జాతివారైనా, దేశస్థులైన అందర్నీ ఒక్క చోట ప్రోదిచేసి ముందుకు నడిపించే ఈ సంస్థ భారీఎత్తున “యూనిఫైఎడ్ (YOUnified)” కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
దాదాపు మూడు, నాలుగు వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనే ఈ కార్యక్రమం అత్యంత కోలాహలంగా ఈ సంవత్సరం ఆగస్టు 3న మెంఫిస్ అగ్రి సెంటర్ ఇంటర్నేషనల్ (Agricenter International) కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యాక్రమంలో ఇండియన్ బాలే థియేటర్ (స్పిరిట్యుయల్ ఫౌండేషన్) వారు “డాన్సింగ్ బెల్స్ అఫ్ ఇండియా” కూచిపూడి నృత్య ప్రదర్శన అత్యద్భుతంగా నాట్య గురువులు డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. బ్రిడ్జి బిల్డర్స్ ప్రత్యేక ఆహ్వానం మేరకు చేసిన ఈ నృత్య ప్రదర్శనలో శ్రీ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభలతో పాటు నందిని లక్ష్మి కొండిశెట్టి, శాన్వి కుంటమల్ల మరియు నిధి నిహారిక చెన్నం నాట్య మయూరాలై నర్తించారు. శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని మండలి, శ్రీమతి లక్ష్మి శ్వేత కొండిశెట్టి, శ్రీమతి సుష్మిత కుంటమల్ల ఈ కార్యక్రమానికి కళాకారులకి విశేష సహాయ సహకారాలు అందించారు.
మరిన్ని వివరాలకు:
Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
7062 S. Beringer Drive
Cordova, TN 38018
ramanavvasili@hotmail.com
901-387-9646
http://spiritualfoundation.us/













