ఆ రెండు దేశాల మధ్య గోడ
అమెరికన్లకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. తనను గెలిపిస్తే మెక్సికో- అమెరికా మధ్య పెద్ద గోడకడతానని ప్రటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అమెరికా- మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణాకి సంబంధించి ఎనిమిది నమూనాలను సిద్ధం చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాండియాగో, టిజువానా(మెక్సికో) సరిహద్దులో వీటిని ఏర్పాటు చేశారు. నమూనా నిర్మాణాల్లో కాంక్రీట్, లోహంతో తయారు చేసిన గోడలు ఉన్నాయి. ఒక్కొక్కటి 9 మీ. పొడవు, 18 నుంచి 30 మీ. ఎత్తులో ఉండేలా రూపొందించారు. గోడను ఎక్కి, దాటి రాకుండా ఉండేందుకు పైభాగాన పదునైన కొక్కీలను పొందుపరిచారు. ఒక్కో నమూనా నిర్మాణానికి అమెరికా 5 లక్షల డాలర్లను ఖర్చు చేసింది. వీటిల్లో ఏదో ఒక నమూనాను ట్రంప్ ఖరారు చేయనున్నారు. ట్రంప్ ఆమోదముద్ర వేసిన వెంటనే గోడ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు.
మెక్సికో-అమెరికా సరిహద్దు గోడ విశేషాలు :
అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవు 3,146 కి.మీ. ఇప్పటికే 1,052 కి.మీ. మేర ఒక వరుస కంచె, మరో 82 కి.మీ. మేర రెండు, మూడు వరుసల కంచె 18 నుంచి 30 మీ. ఎత్తులో సరిహద్దు గోడ నిర్మాణం. అందుకు అయ్యే వ్యయం దాదాపు రూ.65వేల కోట్లు. కాంక్రీట్, లోహంతో నిర్మించిన నమూనాలు సిద్దం. గోడను ఎక్కకుండా పై భాగాన పదునైన కొక్కీల ఏర్పాటు, రక్షణగా 10వేల బోర్డర్ పెట్రోలింగ్ సిబ్బంది నియామకం.













