హౌస్టన్ బోనాలు 2018
తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హౌస్టన్ (TAGH) ఆధ్వర్యములో గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ బోనాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగముగా ఈ సంవత్సరము స్థానిక హూస్టన్ శ్రీ సాయిబాబా జలరం మందిర్ లో ఎంతో అంగరంగ వైబవుముగా బోనాలు జరుపుకున్నారు. సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొని పోతురాజు డాన్సులు తో భక్తి శ్రద్దలతో జరిపారు. అమ్మవారి బోనాలు అలాకారణముని పద్మ కొత్తకొండ ఎంతో బాగా డెకొరేషన్ చేసినారు. వచ్చిన భక్తులకి అమ్మవారి మహా ప్రసాదములని స్థానిక బిర్యానీపాట్ ఓనర్ శ్రీధర్ కాంచనకుంట్ల సమర్పించారు.
టాగ్ అధ్యక్షులు విజయ్ దేవిరెడ్డి, వైస్ ప్రెసిడెండ్ వీరేందర్ మరియు టాగ్ కమిటీ వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సంవత్సరము బోనాలు స్పెషల్ గెస్ట్ గా డెమొక్రాట్స్ తరుపున కాంగ్రెస్ కి టెక్సాస్ తరుపున పోటీ చేస్తున్న శ్రీనివాస్ కులకర్ణి పాల్గొని తెలంగాణ బోనాలు లో పాల్గొన్న వాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.













