టొరంటో పేలుడుపై స్పందించిన సుష్మా
కెనడాలోని టొరంటో నగర శివారులోని భారతీయ రెస్టారెంట్లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్విటర్ ద్వారా హెల్ప్‌లైన్ నంబర్‌ను ట్వీట్ చేశారు. ‘కెనడాలోని ఒంటారియో మిస్సిస్వాగాలోని భారతీయ రెస్టారెంట్ ‘బాంబే భెల్’లో ఈ పేలుడు సంభవించింది. టొరంటో కాన్సుల్ జనరల్, కెనడాలోని ఇండియన్ కమిషనర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడి విషయాలను తెలుసుకుంటున్నాను. అత్యవసర సమాచారం కోసం 1-647-668-4108 సంప్రదించండి’ అంటూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.













