బోయింగ్‌కు చుక్కెదురు
విమానాల తయారీకి విఖ్యాతిగాంచిన బోయింగ్ కంపెనీ పరిధి ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించింది. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్ లైనర్ క్యాప్సూల్‌కు చెందిన డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ స్పేస్ సెంటర్ ప్రయోగించింది. అట్లాస్ 5 రాకెట్‌తో నింగిలోకి దూసుకెళ్లిన స్టార్‌లైనర్..15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని లక్షిత కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో ఈ వైఫల్యం పెద్దదనే చెప్పాలి.













