737 మాక్స్ లో మార్పులు చేర్పులు
737 మాక్స్ విమానాల్లో బోయింగ్ కొన్ని మార్పులు చేపట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విమానాల్లో బోయింగ్ ఒక హెచ్చరిక వ్యవస్థను అమర్చనుంది. గతంలో ఈ వ్యవస్థను ఒక ఆప్షనల్‌గా మాత్రమే అందజేసేది. ఈ వ్యవస్థ గతంలో ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ విమానంలో గానీ, ఇథియోపియా విమానంలో కానీ లేదు. స్టాల్ వ్యవస్థ ఎప్పుడైతే వ్యతిరేక సాంకేతాలను పంపిస్తుందో.. అప్పుడు ఇది హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ వ్యవస్థను ఉచితంగా అమర్చనుంది. దీంతోపాటు ప్రమాదానికి కారణమైన సాఫ్ట్‌వేర్‌ను బోయింగ్ తాజాగా అప్‌గ్రేడ్ చేయనుంది. ఎంకాస్ వ్యవస్థ నుంచి వచ్చే సంకేతాలను, సెన్సర్ల నుంచి వచ్చే సంకేతాలకు మధ్య తేడాలు ఉంటే ఈ కొత్త సాఫ్ట్వేర్ రంగంలోకి దిగుతుంది. వెంటనే ఎంకాస్ వ్యవస్థను డిజేబుల్ చేస్తుంది. గతంలో జరిగిన రెండు ప్రమాదాలు విమానాల్లోకి ఎంకాస్ వ్యవస్థ కారణంగా జరిగనట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. లయన్ ఎయిర్ విమానం ప్రమాదానికి దాదాపు 20 సార్లు కింద వైపునకు దూసుకుపోయినట్లు తేలింది.













