ఉద్యోగం లేకుంటే.. ఇల్లు ఇవ్వబడవు
కరోనా మహమ్మారి విజృంభించడంతో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిన అమెరికాలో ఇప్పుడు అద్దె ఇళ్ల సమస్య ప్రధానంగా ముందుకొస్తొంది. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉద్యోగం లేనివారికి ల్లు అద్దెకు ఇవ్వం అని బోర్డులు పెట్టి మరీ చెబుతున్నారు. ఇప్పటికే అద్దె ఇళ్లలో ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ బాధితుల్లో చాలావరకు మైనార్టీలు, అల్పాదాయ వర్గాలు, నల్లజాతీయులు, గోధమ వర్ణం, కలిగినవారు, తరతరాలుగా అణచివేతకు గురవుతూ వస్తున్న జాతుల వారే ఎక్కువగా ఉన్నారు. అల్పాదాయ హౌసింగ్ కొయెలేషన్ అధ్యక్షుడు డైనీ, యాటెల్ మాట్లాడుతూ ఈ బలవంతపు ఖాళీ కార్యక్రమానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తామర తంపరగా పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం ఈ వర్గాల పట్ల తొలి నుంచి అనుసరిస్తూ వస్తున్న వివకాపూరిత విధానాలకు కరోనా మహమ్మారి కూడా తోడవడంతో వారి బాధలు అన్నీ ఇన్నీ కావు.













