హెచ్ 4 వీసాపై ట్రంప్ కన్ను
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ట్రంప్ విదేశీ ఉద్యోగులపై వేటు వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 2015లో ఒబామా తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకీ చట్టం ఎందుకు తెచ్చారంటే హెచ్1బీ వీసాదారులు అమెరికాలో స్థిరపడితే వారి వెంట తమ భార్య, ఇతర బంధువులెవరైనా అమెరికా తీసుకురావచ్చు. అలా వచ్చిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. అందుకోసం ఒబామా ప్రభుత్వం హెచ్4 వీసాను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దాదాపు లక్ష మంది హెచ్4 వీసాదారులు అమెరికాలో పనిచేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది. వారి వల్ల స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం వారిపై వేటు వేయబోతోంది. అయితే హెచ్4 వీసాదారుల్లో 70 శాతం మంది భారతీయులున్నట్లు చెబుతున్నారు. హెచ్4 వీసాదారులను హఠాత్తుగా ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తే వారి పరిస్థితి అగమ్యగోచరమవుతుందని ప్రవాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే హెచ్1బీ వీసాదారుల బంధువులకు ఉద్యోగాలు నిరాకరించే బిల్లును చట్ట సభలో ప్రవేశపెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.













