ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రత్యేక పూజలతో సాయినాథుడికి సమర్పించి సంబరాలు
అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో ఎడిసన్ నగరం సాయి దత్త పీఠం లో భారతీయ ఎన్ఆర్ఐలు నరేంద్ర మోడీ గారు భారీ మెజారిటీతో మళ్ళీ భారత దేశ ప్రధానమంత్రిగా రెండవసారి భారీ సాధించటంతో ఎన్ఆర్ఐలు తమ మొక్కును సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు శ్రీ రఘు శర్మ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో సాయినాథుడికి సమర్పించి తీర్చుకున్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లాలని అందరూ కోరుకున్నారు. ఓవర్సేస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గత అయిదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అరవై ఏళ్లలో ఎపుడు జరగలేదని వివరించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో అభివృద్ధి ఎజండాగా అవినీతి రహిత పాలనను అందిస్తూ భారత దేశాన్ని సురక్షితంగా ఉంచాడనికి చర్యలు తీసుకుంటూ భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిస్తూ భారత దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలని మోడీ గారు చేస్తున్న కృషికి మరింత విజయం దక్కాలని మనస్ఫూర్తిగా ఎన్ఆర్ఐలందరు ఆకాంక్షించారు.
ఓవర్సేస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రసిడెంట్ కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ ఎలక్షన్స్ సమయంలో ఓవర్సేస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ కార్యకర్తలు 1.4 మిలియన్స్ ఫోన్ కాల్స్ భారత దేశంలో ప్రజలకు చేసి బీజేపీ కి ఓటు వేయాలని క్యాంపెయిన్గింగ్ చేసారని, ఆలా చేసిన 108 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 96 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఓవర్సేస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ క్యాంపెయిన్గింగ్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు అమెరికా లోని ౩౦ నగరాల్లో కార్ ర్యాలీలు, చౌకీదార్ మార్చులు, సోషల్ మీడియా క్యాంపెయిన్గింగ్ ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎన్ఆర్ఐలో ఉత్సాహం కలిగించడంతో అందరు భారత దేశంలో ఉన్న తమ కుటుంభ సభ్యులు, మిత్రులతో ఫోన్లో మాట్లాడి అందరు నరేంద్ర మోడీ గారు చేసినా అభివృద్ధికి ఓటు వేయమని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది ఎన్ఆర్ఐ సాయి భక్తులు పాల్గొని భారత్ మాత కి జై, జై హింద్ అంటూ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
అఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ తెలంగాణ లో నలుగురు ఎంపీ లు గెలవడం, జి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి రావడం తో ఈ సంబరాలలో తెలుగు వారు ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యూత్ కో-కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఏపీ లో కూడా బలోపితం అవడానికి అఫ్ బీజేపీ పని చేస్తుంది అన్నారు.
ఓఎఫ్ బిజెపీ తెలంగాణ చాప్టర్ కో-కన్వీనర్ సంతోష్ కోరం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 కార్యక్రమాలు చేపడుతూ, తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలియచేయాలి అని తెలిపారు.
ఓఎఫ్ బిజెపీ తెలంగాణ చాప్టర్ మీడియా కన్వీనర్ వంశీ యంజాల మాట్లాడుతూ, మీడియా లో ఆదరణ పెంచాలిసిన అవసరం చాల ఉంది అని తెలిపారు.
ఈ సంబరాల్లో, ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల, అఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, ఓఎఫ్ బిజెపీ న్యూజెర్సీ యూత్ కో-కన్వీనర్ & తెలంగాణ చాప్టర్ కో-కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, మరియు తెలంగాణ చాప్టర్ కో-కన్వీనర్ సంతోష్ కోరం మరియు వంశీ యంజాల ఉత్సహంగా పాల్గొన్నారు.













